కేరళలో కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా తీవ్రంగానే ఉన్నది. గడిచిన 24 గంటల్లో కూడా కొత్తగా 17,681 మందికి పాజిటివ్ వచ్చింది. దాంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 44,24,046కు చేరింది. ఇక ఇవాళ 208 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య కూడా 22,987కు పెరిగింది. అయితే, ఇవాళ 25,588 మంది కరోనా బాధితులు మహమ్మారి బారి నుంచి బయటపడ్డారు. దాంతో మొత్తం రికవరీల సంఖ్య 42,09,746కు చేరింది.
ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులలో కరోనా మరణాలు, రికవరీలు పోను ప్రస్తుతం 1,90,750 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళలోని 14 జిల్లాల్లో మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్నది. అందులో ఇవాళ తిరువనంతపురం జిల్లాలో అత్యధికంగా 2,143 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొట్టాయం 1,702 కేసులు, కోజికోడ్ 1,680 కేసులు ఆ తర్వాత రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. కేరళ ఆరోగ్యశాఖ ఈ వివరాలను వెల్లడించింది.