జాతీయం ముఖ్యాంశాలు

కొత్త‌గా 13,058 పాజిటివ్ కేసులు, 164 మంది మృతి

దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 13,058 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. గ‌త 231 రోజుల్లో ఇదే అత్య‌ల్ప సంఖ్య‌. దేశ‌వ్యాప్తంగా 19,470 మంది క‌రోనా నుంచి కోలుకోగా, గ‌డిచిన 24 గంట‌ల్లో 164 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసులు దేశ‌వ్యాప్తంగా 1,83,118 ఉన్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్‌లో వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన‌వారి సంఖ్య 4,52,454గా ఉన్న‌ది. ఇక క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగంగా జ‌రుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 98.67 కోట్ల కోవిడ్ టీకా డోసుల‌ను ఇచ్చేశారు.

ఇండియాలో గ‌త 24 గంట‌ల్లో అత్య‌ధికంగా కేర‌ళ‌లో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఆ రాష్ట్రంలో కొత్త‌గా 6676 కేసులు రికార్డు అయిన‌ట్లు ప్ర‌భుత్వం చెప్పింది. ఇక దేశంలో 164 మంది మ‌ర‌ణించ‌గా, దాంట్లో 60 మంది కేర‌ళ‌లోనే ప్రాణాలు కోల్పోయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ తెలిపింది. రిక‌వ‌రీ రేటు 98.14 శాతం ఉంద‌ని, మార్చి 2020 త‌ర్వాత ఇదే అత్య‌ధిక‌మ‌ని ప్ర‌భుత్వం చెప్పింది. వీక్లీ పాజిటివ్ రేటు 1.36 శాతంగా ఉంది. గ‌డిచిన 50 రోజుల నుంచి డెయిలీ పాజిటివ్ రేటు 3 శాతం క‌న్నా త‌క్కువ‌గా ఉన్న‌ది.