జాతీయం ముఖ్యాంశాలు

నేవీ చేతికి పీ15బీ క్షిపణి విధ్వంసక నౌక

దేశంలోనే మొట్టమొదటిసారి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన పీ15బీ స్టెల్త్‌ గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్‌ (యుద్ధ నౌక) భారత నౌకాదళంలో చేరింది. దీన్ని ముంబైలోని మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ నిర్మించింది. నౌకకు ‘విశాఖపట్నం’ అని పేరు పెట్టారు. దీని నుంచి యాంటి-ఎయిర్‌క్రాఫ్ట్‌ క్షిపణులను ప్రయోగించవచ్చు.