తూర్పు లఢక్‌లో చైనాతో ప్రతిష్టంభన సందర్భంగా అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించిన 260 మంది ఐటీబీపీ జవాన్లను స్పెషల్ ఆపరేషన్ మెడల్స్ వరించాయి. ఈ అవార్డు కోసం మొత్తం 397 మందితో కేంద్రం జాబితాను విడుదల చేయగా వారిలో 260 మంది ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) జవాన్లు ఉండటం గమనార్హం. ఐటీబీపీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఒకేసారి ఇంతమందికి అవార్డు ప్రకటించడం ఇదే తొలిసారి అని తెలిపారు.
260 మంది ఐటీబీపీ జవాన్లకు స్పెషల్ ఆపరేషన్ మెడల్స్