జాతీయం ముఖ్యాంశాలు

జైకోవ్‌-డీ ఒక్క డోసుకు 265!

కరోనా టీకా జైకోవ్‌-డీ ధరను ఒక్కో డోసుకు రూ.265కు తగ్గించేందుకు జైడస్‌ క్యాడిలా అంగీకరించింది. తొలుత జైడస్‌ క్యాడిలా తమ టీకా మూడు డోసులకు కలిపి రూ.1,900గా ప్రతిపాదించింది. అంటే ఒక్కో డోసుకు రూ.633 అన్నమాట. ఈ నేపథ్యంలో ధర తగ్గింపునకు కేంద్రం సంప్రదింపులు జరిపింది. అయితే వ్యాక్సిన్‌ ధరపై తుది ఒప్పందం ఇంకా పూర్తి కాలేదని అధికారులు తెలిపారు. జైకోవ్‌-డీ టీకాని 12 ఏండ్ల నిండిన వారికి వేస్తారు.