జాతీయం

భారత్‌కు ఫేస్‌బుక్‌ విజిల్‌బ్లోయర్‌!

విజిల్‌బ్లోయర్‌గా మారిన ఫేస్‌బుక్‌ మాజీ డాటా సైంటిస్ట్‌ ఫ్రాన్సెస్‌ హాగెన్‌ను ఇన్ఫర్మేషన్‌, టెక్నాలజీ పార్లమెంటరీ స్థాయీ సంఘం ముందు హాజరయ్యేందుకు పిలువనున్నట్టు ఆ సంఘం అధ్యక్షుడు, కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ తెలిపారు. ఫేస్‌బుక్‌, దానికి చెందిన సామాజిక మాధ్యమాలు పిల్లలకు హాని కలిగిస్తున్నాయని, పోలరైజేషన్‌కు ప్రేరేపిస్తున్నాయని హాగెన్‌ ఇటీవల ఆరోపించారు. దీనిపై అమెరికా సెనేట్‌ కమిటీ ముందు ఆమె సాక్ష్యమిచ్చారు కూడా. అయితే పార్లమెంటు గానీ కేంద్రప్రభుత్వం గానీ విజిల్‌బ్లోయర్స్‌ను విచారించకపోవడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో థరూర్‌ స్పందించారు. సెప్టెంబర్‌ 12 నుంచి అక్టోబర్‌ 12 మధ్య స్థాయీ సంఘం మనుగడలో లేదని తెలిపారు. విదేశాలకు చెందిన వ్యక్తిని రప్పించేందుకు అవసరమైన స్పీకర్‌ అనుమతిని కోరామని వెల్లడించారు.