ఆఫ్ఘనిస్తాన్లో విదేశీ కరెన్సీపై తాలిబన్లు నిషేధం విధించారు. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత జఠిలంగా తయారుకానున్నది. ఆగస్టులో దేశాన్ని తాలిబన్లు ఆధీనంలోకి తీసుకున్న తర్వాత.. ఆఫ్ఘన్ జాతీయ కరెన్సీ విలువ దారుణంగా పతనమైంది. విదేశీమారక నిలువలు కూడా అడుగంటిపోయాయి. దేశంలో ఉన్న బ్యాంకుల్లో నగదు కూడా క్రమంగా తగ్గుతోంది. మరో వైపు ప్రపంచ దేశాలు ఆఫ్ఘన్లోని తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించడం లేదు. దీంతో ఆ దేశానికి కష్టాలు మరింత రెట్టింపు అయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్లో చాలా వరకు అమెరికా డాలర్ల రూపంలో వాణిజ్యం నడుస్తుంది. ఇక పాకిస్థాన్ బోర్డర్ దారిలో పాక్ కరెన్సీని కూడా వినియోగిస్తారు. స్వదేశీ వ్యాపారం కోసం విదేశీ కరెన్సీ వాడే వారిని శిక్షిస్తామని తాలిబన్ల ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ తెలిపారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ప్రతి లావాదేవి కోసం ఆఫ్ఘనీ కరెన్సీ వాడాలని ముజాహిద్ ఆదేశించారు.
Related Articles
అధ్యక్ష , ప్రధానమంత్రి నివాసాల్లోనే తిష్ఠవేసిని నిరసనకారులు
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email అధ్యక్ష డు రాజీనామా చేసే వరకు కదిలేది లేదంటున్న వైనం అధ్యక్ష డు రాజీనామా చేసే వరకు కదిలేది లేదంటున్న వైనం. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ప్రధాని మహింద రాజపక్స నివాసాలను ఇటీవల ముట్టడించి ఆక్రమించుకున్న ఆందోళనకారులు ఇంకా అక్కడే […]
అమెరికాలో మంచు తుఫాను బీభత్సం
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email వాతావరణ మార్పుల ప్రభావం అమెరికాపై స్పష్టంగా కనిపించింది. ఈ ఏడాది అగ్రరాజ్యంపై ప్రకృతి విపత్తులు విరుచుకుపడ్డాయి. మొన్నటి అకాల వర్షాలు, కార్చిచ్చుల నుంచి ఇప్పటి మంచు ఉత్పాతం దాకా అమెరికా ప్రతికూల పరిస్థితుల మధ్య మనుగడ కొనసాగిస్తున్నది. ప్రస్తుతం అక్కడ హిమపాతం ప్రమాదకరంగా మారింది. ఓవైపు […]
పలు దేశాల్లో ఇంటర్నెట్ దాడికి గురవుతోంది
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email బలమైన ప్రజాస్వామ్య దేశాలు దీనిపై దృష్టి పెట్టాలి..గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగ విస్తృతి భారీగా పెరిగిపోయింది. గ్రామీణులు కూడా ఇంటర్నెట్ను బాగా వాడేస్తున్నారు. అయితే, పలు దేశాల్లో దాని వినియోగంపై ఉన్న ఆంక్షలు, నిఘా వంటి అంశాలపై గూగుల్ సీఈవో సుందర్ […]