బాలీవుడ్ హీరో షారూఖ్‌ఖాన్ కొడుకు, ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసు నిందితుడు ఆర్యన్ ఖాన్ ఇవాళ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ముందు హాజరయ్యాడు. ఆర్యన్ ఖాన్ ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ సేవిస్తూ గత నెల 2న ఎన్సీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఎన్సీబీ విచారణ అనంతరం అక్టోబర్ 8న ఆర్థర్ రోడ్ జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత ఎన్సీబీ స్పెషల్ కోర్టు, కింది కోర్టులలో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌లు వేయగా.. రెండు కోర్టులు తిరస్కరించాయి.
దాంతో బాంబే హైకోర్టులో ఆర్యన్‌ఖాన్ బెయిల్ పిటిషన్ వేశాడు. రెండు వాయిదాలతో విచారణ పూర్తిచేసిన బాంబే హైకోర్టు.. అక్టోబర్ 28న ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఆర్థర్ రోడ్ జైలు అధికారులు అక్టోబర్ 30న జైలు నుంచి విడుదల చేశారు. అయితే బెయిల్ మంజూరు సందర్భంగా బాంబే హైకోర్టు ప్రతి శుక్రవారం ఎన్సీబీ ముందు హాజరు కావాలని ఆర్యన్ ఖాన్‌కు షరతు విధించింది. ఆ మేరకు ఇవాళ ఎన్సీబీ ముందు ఆర్యన్ ఖాన్ హాజరయ్యారు.