రాష్ట్రంలోని బీసీ విద్యార్థులకు శుభవార్త. సివిల్స్ -2022 రాయాలనుకునే అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. సివిల్స్ సాధించాలన్నా ఆసక్తి గల యువత కోసం బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అవసరమైన కోచింగ్‌ను ఉచితంగా ఇస్తామని ఆయన తెలిపారు.
సివిల్స్ రాయడానికి అర్హతగల యువత ఈ నెల 10వ తేదీ నుంచి http://tsbcstudycircle.cgg.gov.in లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ నెల 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి 28వ తేదీన స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. మరిన్ని వివరాల కోసం బీసీ స్టడీ సర్కిల్ 040 -24071178లో సంప్రదించాలి.