జాతీయం ముఖ్యాంశాలు

కాన్పూర్‌లో జికా.. కొత్త‌గా 16 మందికి వైర‌స్‌

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్‌లో కొత్త‌గా 16 జికా వైర‌స్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య వంద దాటింది. 106 కేసుల్లో కొత్త‌గా వైర‌స్ సోకిన‌వారిలో 9 మంది పురుషులు, ఏడు మంది మ‌హిళ‌లు ఉన్నారు. హ‌రిజింద‌ర్ న‌గ‌ర్‌, పోకార్‌పూర్‌, తివారిపుర్‌, బ‌గియా, ఖాజీ ఖేరా ప్రాంతాల‌కు చెందిన వాళ్ల‌కు కొత్త‌గా జికా సోకింది. వైర‌స్ ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలిన గ‌ర్భిణులకు ఆల్ట్రాసౌండ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. అయితే గ‌ర్భిణుల‌ పిండాలు ఆరోగ్యంగా ఉన్న‌ట్లు డాక్ట‌ర్లు ద్రువీక‌రించారు. కొత్త‌గా జికా వ‌చ్చిన వారిని హోమ్ ఐసోలేష‌న్‌లో పెట్టారు. చాలా వ‌ర‌కు పేషెంట్ల‌లో ఎటువంటి ల‌క్ష‌ణాల‌ను గుర్తించ‌లేదు. డోర్ టు డోర్ స‌ర్వే చేప‌డుతున్నారు. గ‌ర్భిణులు త‌మ పిండాల్లో ఏదైనా లోపం గ‌మ‌నిస్తే, త‌క్ష‌ణ‌మే రిపోర్ట్ చేయాల‌ని ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది.