అంతర్జాతీయం జాతీయం ముఖ్యాంశాలు

భారత్‌కు చైనానే మొదటి శత్రువు: రావత్‌

భారత్‌కు మెదటి శత్రువు పాకిస్థాన్‌ కాదని, చైనా అని త్రిదళాధిపతి (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ అన్నారు. వాస్తవధీన రేఖ వెంట ఉద్రిక్తతల తగ్గింపు కంటే ముందుగా బలగాల ఉపసంహరణపైనే భారత్‌ దృష్టి పెట్టిందన్నారు. ఢిల్లీలో గురువారం జరిగిన టైమ్స్‌ నౌ సమ్మిట్‌-2021 సందర్భంగా మాట్లాడుతూ రావత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 2020 ఏప్రిల్‌ ముందునాటి పరిస్థితులకు తిరిగి వెళ్లడంపైనే లక్ష్యంగా దృష్టి కేంద్రీకరించామన్నారు. అరుణాచల్‌లో చైనా ఒక గ్రామాన్ని నిర్మించిందన్న వార్తలపై స్పందిస్తూ అవాస్తమని తోసిపుచ్చారు.