అంతర్జాతీయం జాతీయం ముఖ్యాంశాలు

విదేశాల నుంచి వచ్చే.. ఐదేండ్లలోపు పిల్లలకు కొవిడ్‌ టెస్టు లేదు

విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ఐదేండ్లలోపు చిన్నారులకు కొవిడ్‌ పరీక్ష అవసరం లేదని కేంద్రం తెలిపింది. ప్రయాణ సమయంలో లేదా హోం క్వారంటైన్‌ సమయంలో కరోనా లక్షణాలు కనిపిస్తే స్టాండర్డ్‌ మార్గదర్శకాలు వర్తిస్తాయన్నది. విదేశాల నుంచి వచ్చేవారికి కొవిడ్‌-19 సవరణ మార్గదర్శకాలను విడుదల చేసింది. వ్యాక్సిన్‌ పూర్తి డోసులను వేసుకున్నవారు కరోనా పరీక్షలకు హాజరుకాకుండానే వెళ్లొచ్చని, హోం క్వారంటైన్‌ నిబంధనలు కూడా వారికి వర్తించబోవని తెలిపింది. ఒక డోసు వ్యాక్సిన్‌ లేదా టీకా వేసుకోనివారు తప్పనిసరిగా ప్రీ, పోస్ట్‌ ట్రావెల్‌ కొవిడ్‌ టెస్టు, హోం క్వారంటైన్‌లో ఉండాలని స్పష్టంచేసింది.