జాతీయం ముఖ్యాంశాలు

చెన్నైలో కుండపోత

  • తమిళనాడులో వర్షాలకు 14 మంది మృతి

చెన్నైతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో వర్షాల కారణంగా చోటుచేసుకున్న దుర్ఘటనల్లో 14 మంది మరణించారు. పంటలు నీట మునిగాయి. పలుచోట్ల చెట్లు పడిపోయాయి. వెయ్యి ఇండ్లు (వీటిలో ఎక్కువ పూరిగుడిసెలు) దెబ్బతిన్నాయి. కుండపోత వానతో పాటు డ్యామ్‌ల నుంచి 13 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో చెన్నైతో పాటు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం సాయంత్రం తీరాన్ని దాటింది.