ఆంధ్రప్రదేశ్ జాతీయం ముఖ్యాంశాలు

Vishwa Bhushan Harichandan: ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌కు అస్వస్థత.. హెల్త్‌ బులెటిన్ విడుదల

AP Governor Biswabhusan Harichandan is Unwell: సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆరోగ్యంపై ఏఐజీ హస్మిటల్స్‌ హెల్త్‌ బులెటిన్ విడుదల చేసింది. 88 ఏళ్ల గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ నవంబర్ 17న మధ్యాహ్నం 1 గంటకు గచ్చిబౌలిలోని ఏఐజీ  హాస్పిటల్స్‌లో అడ్మిట్ అయ్యారని వైద్యులు పేర్కొన్నారు.https://71182e03e75d52e9bcf32d3db67e6a1d.safeframe.googlesyndication.com/safeframe/1-0-38/html/container.html

అయితే  గవర్నర్‌కు నవంబర్ 15న కోవిడ్‌ పాజిటివ్‌గా తేలిందని, ప్రస్తుతం ఆయనకు ఆక్సిజన్ అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. కాగా ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్ హరిచందన్ బుధవారం అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. 

వివరాలు తెలుసుకున్న సీఎం జగన్‌
గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆరోగ్యంపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. ఏఐజీ చైర్మన్‌, సీనియర్‌ వైద్యుడు డాక్టర్‌ డి.నాగేశ్వర్‌ రెడ్డితో సీఎం నేరుగా ఫోన్‌లో మాట్లాడారు. గవర్నర్‌ ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్యంపై వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. గవర్నర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని ఈ సందర్భంగా డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి తెలిపారు.