సరికొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) ప్రపంచాన్ని వణికిస్తున్నది. దేశాలన్నీ మరోసారి అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలపై నిషేధం విధించడానికి సన్నద్ధమవుతున్నాయి. ఆఫ్రికా నుంచి వచ్చిన విమానంలో ఇద్దరు ప్రయాణికులకు కరోనా పాజిటివ్ రావడంతో ఆస్ట్రేలియా అప్రమత్తమయింది. శనివారం దక్షిణాఫ్రికా నుంచి సిడ్నీకి ఓ విమానం వచ్చింది. అందులో ఇద్దరు ప్రయాణికులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ విమానంలో వచ్చిన అందరిని విమానాశ్రయం నుంచి నేరుగా హోటల్‌కు తరలించారు. వారందరిని 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచుతామని అధికారులు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో గత కాలంగా ఆఫ్రికాలోని తొమ్మిది దేశాల నుంచి వచ్చినవారిని అధికారులు గుర్తించేపనిలో పడ్డారు. వారందరికి జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు చేయించాలని నిర్ణయించారు. వారితో కలిసినవారు వీలైనంత తొందరగా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
కాగా, కరోనా మహమ్మారి విజృంభణతో విధించిన ఆంక్షలను వారం రోజుల కిత్రమే ఎత్తివేసింది. అంర్జాతీయ సరిహద్దులను తెరచింది. ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు 2,05,000 కేసులు నమోదవగా, 1,985 మంది మృతిచెందారు.