గుజరాత్‌లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా జగదీష్ ఠాకూర్ నియమితులయ్యారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆయనను గుజరాత్ పీసీసీ చీఫ్‌గా నియమించారు. గుజరాత్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. గత నాలుగు పర్యాయాలుగా అక్కడ ఓటమి పాలవుతున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని భావిస్తున్నది. ఈ క్రమంలో ప్రస్తుత పీసీసీ చీఫ్ అమిత్ చౌదాను తొలగించి.. ఆయన స్థానంలో జగదీష్ ఠాకూర్‌ను నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాంగాంధీ గుజరాత్ పీసీసీ చీఫ్‌గా జగదీష్ ఠాకూర్‌ను నియమించారని ఆ పార్టీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేశారు. అదేవిధంగా పీసీసీ పదవి నుంచి తప్పుకున్న అమిత్ చౌదా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అందించిన సేవలను కాంగ్రెస్ అభినందిస్తున్నదని వేణుగోపాల్ తన ప్రకటనలో పేర్కొన్నారు.