ధాన్యం కొనుగోళ్ల అంశంలో కేంద్రంపై యుద్ధం చేస్తున్న టీఆర్ఎస్
పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ఉభయసభల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వీరి ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పార్లమెంటు సెషన్ మొత్తాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇదే సమయంలో కేంద్రం తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కూర్చొని నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నారు.
మరోవైపు టీఆర్ఎస్ ఎంపీలు హైదరాబాద్ కు వచ్చి సీఎం కేసీఆర్ తో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ధాన్యం కొనుగోళ్ల అంశంలో ఒకట్రెండు రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.