ఆమె ఛాంబర్లో అంతమంది ప్రజా ప్రతినిధులు ఎందుకున్నారని ప్రశ్న
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిక్తా తన బయోడేటా గురించి ఓ జర్నలిస్టును అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారని ఆయన చెప్పారు. ఆమె ఛాంబర్ లో 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నలుగురు జెడ్పీ ఛైర్మన్లు, ఒక ఎమ్మెల్సీ, 22 మంది ప్రజా ప్రతినిధులు ఉన్నారని… అంత మంది అక్కడ ఎందుకున్నారని ప్రశ్నించారు.
కేసీఆర్ ఆయన భాషలో లాగు తడవాలని అంటుంటారని… తాను ఆమె చీర తడుపుతా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె చీర తడపకపోతే తన పేరు గోనె ప్రకాశరావు కాదని అన్నారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కాంగ్రెస్ కు తగదని చెప్పారు. ప్రతి విషయంలో బీజేపీకి టీఆర్ఎస్ మద్దతు పలికిందని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ పునాదులు కదులుతున్నాయని చెప్పారు.