అయ్యప్ప దర్శనం కోసం వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను తీసుకొచ్చింది. ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ట్రైన్ సర్వీసులను నడపబోతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ – కొల్లాం మధ్య అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ ప్రత్యేక రైలు డిసెంబర్ 17న సికింద్రాబాద్ నుంచి కొల్లం స్టేషన్‌కు (07109) బయల్దేరనుంది. కొల్లాం నుంచి సికింద్రాబాద్ (07110) కు డిసెంబర్ 19న స్పెషల్ రైలు బయల్దేరుతుందని పేర్కొంది. ఈ స్పెషల్ ట్రైన్‌కు రిజర్వేషన్ల ప్రక్రియ (డిసెంబర్ 10న) శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభవుతుందని వెల్లడించింది.
ఈ ప్రత్యేక రైళ్లు చర్లపల్లి, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, జోలార్‌పెట్టై, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్, పాలక్కడ్, త్రిశూర్, ఎర్నాకులం, కొట్టాయం, చెంగన్‌చెరి, చెంగనూరు, మావలికర, కయాంకులం స్టేషన్ల మీదుగా ప్రయాణించనున్నాయి.
అదే విధంగా తిరుగు ప్రయాణంలోనూ కొల్లాం నుంచి సికింద్రాబాద్ వరకు ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. ఈ నెల 21, 22 తేదీల్లో కొల్లామ్ నుంచి కాచిగూడకు ప్రత్యేక రైళ్లు(07054, 07142) నడుపుతామన్నారు. 07053, 07054 ప్రత్యేక రైళ్లు షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపర్తి, కొండాపురం, ముద్దనూర్, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, కొండూరు, రేణిగుంట, కాట్పాడి, జోలర్‌పట్టాయ్, సేలం, కోయంబత్తూర్, కలాక్కడ్, త్రిసూర్, ఏర్నాకుళం, కొట్టాయం, చెగంచేరి, తిరువల్లా, చెంగన్నూర్, మవెలికర, కాయన్‌కులం స్టేషన్లలో ఆగుతుందని తెలిపారు.
07141, 07142 ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, సెరం, యాద్గిర్, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గుత్తి, తాడిపర్తి, కొండాపురం, ఎర్రగుంట్ల, కమలాపురం, కడప, నందలూరు, రాజంపేట, కొండూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పట్టై, సేలం, ఎరోడ్, కోయంబత్తూర్, పలక్కడ్, త్రిసుర్, ఎర్నాకుళం, కొట్టాయం, చెంగన్‌చెరి, తిరువల్ల, చెంగన్నూర్, మవెలికర, కాయన్‌కులం స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు తెలిపారు.