జాతీయం ముఖ్యాంశాలు

Stock exchange | టెక్నికల్ సమస్యలపై బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ నూతన మార్గదర్శకాలు..

ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజీలు బీఎస్సీఈ ,ఎన్ఎస్ఈ అంతరాయాలను నివారించడానికి నూతన మార్గదర్శకాలను రూపొందించాయి. సభ్యుల సాంకేతిక లోపాలను సరిచేయడానికి సమగ్ర మార్గదర్శకాలను తయారుచేశాయి. సాంకేతిక లోపంపై సమాచారం అందించేందుకు వీలుగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను కూడా సూచించాయి. కొత్త నిబంధనల ప్రకారం గడువులోపు ఎక్స్ఛేంజీలకు నివేదించడంలో విఫలమైతే సభ్యులు రోజుకు రూ.20వేలు చెల్లించాల్సి ఉంటుందని బీఎస్ఈ,ఎన్ఎస్ఈ లు వేర్వేరు సర్క్యులర్‌లలో పేర్కొన్నాయి.

ఈ మార్గదర్శకాల ప్రకారం సభ్యులు తమ సాంకేతిక వ్యవస్థలో తలెత్తిన లోపాలపై నిర్దేశిత సమయంలో సమాచారం అందించాల్సి ఉంటుంది. లేకపోతే ఎక్స్చేంజీలకు రూ.20వేలు చెల్లించాల్సి ఉంటుంది. సాంకేతిక లోపాల వల్ల వ్యాపార విఘాతం సంభవించే ఏదైనా సంఘటనను నివారించడానికి సభ్యుడు ఉంచాల్సిన సాంకేతిక మౌలిక సదుపాయాలు, ఆయా వ్యవస్థ అవసరాలను ఈ మార్గదర్శకాలు వివరిస్తాయి. 2022 మార్చిలోగా అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి కావాలని బీఎస్ఈ ,ఎన్ఎస్ఈలు తేల్చి చెప్పాయి.