తెలంగాణ

తెలంగాణ ఈరోజు కొత్తగా 12 ఓమిక్రాన్ కేసులు నమోదు

తెలంగాణ రాష్ట్రంలో ఓమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈరోజు రాష్ట్రంలో కొత్తగా 12 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఓమిక్రాన్ కేసుల సంఖ్య 79 కి చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు 27 మంది ఓమిక్రాన్ వేరియంట్ ను జ‌యించి కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇక కరోనా కేసుల విషయానికి వస్తే..రాష్ట్రంలో కొత్తగా 317 కరోనా కేసులు నమోదు కాగా..కరోనా తో ఇద్దరు మరణించారు. అలాగే కరోనా నుంచి 232 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ఈరోజు 28,886 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 3,733 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇక మహారాష్ట్ర , ఢిల్లీ విషయానికి వస్తే… దిల్లీలోనూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 2,716 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఒకరు మరణించారు. మే 21 తర్వాత ఇవే అత్యధిక రోజువారీ కేసులు అని దిల్లీ వైద్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో 9,170 కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మరణించారు. ఒక్క ముంబయి నగరంలోనే ఏకంగా 6,347 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో 5,712 మందికి లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. 451 మంది కోలుకున్నారని తెలిపారు.