జాతీయం ముఖ్యాంశాలు

క‌రోనా కేసులు..ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం ఆంక్ష‌లు

హ‌రిద్వార్ గంగాన‌దిలో పుణ్య‌స్నానాల‌పై క‌ఠిన ఆంక్ష‌లు

క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం కొత్త ఆంక్ష‌లు విధించింది. సంక్రాంతి ప‌ర్వ‌దినాన హ‌రిద్వార్ లో పుణ్య‌స్నానాల‌పై క‌ఠిన ఆంక్ష‌ల‌ను విధించింది. ఈ ప‌ర్వ‌దినాన్న గంగా న‌దిలో నిర్వ‌హించే ప‌విత్ర స్నానాల‌పై సంపూర్ణ నిషేధం విధించింది. హ‌రిద్వార్ లో నైట్ క‌ర్ఫ్యూ కూడా విధించారు. జ‌న‌వ‌రి 14వ తారీఖున భ‌క్తులు ఎవ‌రూ కూడా గంగాన‌ది స్నానాల కోసం రావొద్ద‌ని హ‌రిద్వార్ జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.14నుండి రాత్రి 10గంట‌ల నుండి తెల్ల‌వారుజాము 6గంట‌ల‌వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూ అమ‌లు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.