తెలంగాణ

కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టు విచారణ

తెలంగాణలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఆర్టీపీసీఆర్ టెస్టులు రోజుకు లక్ష పెంచాలని గతంలో హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ టెస్టుల వివరాలు ప్రభుత్వం కోర్టుకు సమర్పించనుంది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై వివరణ ఇవ్వనుంది. అలాగే, కరోనా, ఒమిక్రాన్ కట్టడి చర్యలపై నివేదిక కూడా అందించనుంది.