తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కెసిఆర్ పై మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని అవమానించడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేపడతామని సంజయ్ తెలిపారు. 120 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏమైందని సీఎంను ఉద్దేశించి ప్రశ్నించారు. కేసీఆర్ అంబేద్కర్ వర్ధంతి, జయంతిలకు రారని, దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ అన్నారా? లేదా? అని ప్రశ్నించారు. ఎస్సీగా ఉన్న డిప్యూటీ సీఎంను మార్చారని విమర్శించారు. దళిత రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు. బాబా సాహేబ్కు భారతరత్న ఇచ్చింది బీజేపీయేనన్నారు. మూర్ఖుడిని వదిలేస్తే బలుపెక్కి బరితెగిస్తారని, కేసీఆర్ను జైలుకు పంపడం ఖాయమని బండి సంజయ్ అన్నారు.
Related Articles
గవర్నర్ను కలిసిన స్పీకర్ పోచారం కుటుంబ సభ్యులు
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు సోమవారం కలిశారు. తన మనుమరాలు వివాహానికి ఆహ్వానిస్తూ గవర్నర్కు పోచారం దంపతులు గవర్నర్కు శుభలేఖను అందజేశారు.
కెనడా ఎన్నికల్లో 17 మంది భారతీయ సంతతి ఎంపీల విజయం
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email కెనడా ప్రధానిగా మూడవసారి జస్టిన్ ట్రూడో ఎన్నికయ్యారు. లిబరల్ పార్టీ మెజార్టీ సాధించకున్నా.. ఆ పార్టీయే అధికారాన్ని చేపట్టనున్నది. అయితే ఈసారి కెనడా పార్లమెంట్ ఎన్నికల్లో 17 మంది భారతీయ సంతతి వ్యక్తులు ఎంపీలుగా ఎన్నికయ్యారు. జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమోక్రటిక్ పార్టీ 27 […]
అత్యాచారాలకు పబ్ లు కారణం కాదంటున్న సోనూసూద్
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email రియల్ హీరో సోను సూద్ తాజాగా దేశ వ్యాప్తంగా పెరిగిపోతున్న అత్యాచారాల ఫై స్పందించారు. రీల్ లైఫ్ లో హీరో అనిపించుకుంటే..నిజ జీవితం లో మాత్రం రియల్ హీరో అనిపించుకున్న వ్యక్తి సోనూసూద్. కరోనా సమయంలో సొంత డబ్బుతో ఎంతోమందిని కాపాడి..కనిపించే దేవుడయ్యాడు. ప్రస్తుతం ఎవరు […]