రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలో పశ్చిమ దిశనుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని తెలిపింది. వీటి ప్రభావంతో సోమ, మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు పడుతాయని చెప్పింది. మిగతాచోట్ల పొడి వాతావరణం ఉంటుందని పేర్కొన్నది. గత 24 గంటల్లో వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, నారాయణపేటతో పాటు పలు జిల్లాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా వికారాబాద్ జిల్లా తాండూర్, యాలాల్ జిల్లాల్లో 1.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
తెలంగాణలో మూడు రోజులు వర్షాలు