బీహార్‌లోని మధుబని రైల్వే స్టేషన్‌లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రైల్వేస్టేషన్ లో ఆగి వున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కాగా ఈ మంటలు చెలరేగిన సమయంలో ట్రైన్ లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మంటలు చెలరేగడంతో స్టేషన్‌లో ఉన్న వ్యక్తులు, సిబ్బంది వెంటనే మంటలను ఆర్పే ప్రయత్నం ప్రారంభించారు. సమాచారం మేరకు అగ్నిమాపక శాఖ వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మూడో నంబర్ ప్లాట్‌ఫాంపై ఆగివున్న ఫ్రీడమ్ ఫైటర్ ఎక్స్‌ప్రెస్ బోగీల్లో మంటలు చెలరేగాయి. దాంతో ఇప్పటివరకు రెండు కోచ్‌లు కాలిపోయాయని, మూడవ బోగీ కూడా మంటల్లో చిక్కుకుందని కూడా చెబుతున్నారు.ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు.. ఎస్‌డిఓ అశ్వనీకుమార్, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ రాజీవ్ కుమార్, సిటీ ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్ అమిత్ కుమార్ బృందంతో కలిసి రైల్వే స్టేషన్‌కు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. స్టేషన్‌కు పెద్ద సంఖ్యలో జనం గుమిగూడివున్నారు. కాగా ఈస్ట్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ, శనివారం ఉదయం 09.13 గంటలకు సమస్తిపూర్ డివిజన్‌లోని మధుబని రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న ఖాళీ రైలు కంపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే చర్యలు తీసుకుని 09:50 గంటలకు మంటలను ఆర్పివేశారు. రాక్ మూసి ఉన్న స్థితిలో ఉంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, సమాచారం అందిన వెంటనే ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనపై జీఆర్‌పీ, ఆర్పీఎఫ్‌లు దర్యాప్తు చేస్తున్నాయి. దీన్ని రైల్వే యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. ఉన్నత స్థాయి విచారణ జరుపుతామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Related Articles
కొత్త మంత్రుల పరిచయం అనాదిగా వస్తున్న ఆచారం
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email అడ్డుకోవడం పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి: పీయూష్ గోయల్ ప్రతిపక్షాల తీరుపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్షాకాల సమావేశాల సందర్భంగా ఇవ్వాళ ఆయన రాజ్యసభలో మాట్లాడారు. మంత్రి వర్గ విస్తరణ జరిగినప్పుడు, కొత్త వారిని కేబినెట్ లోకి తీసుకున్నప్పుడు.. వారిని సభకు […]
దేశంలో కొత్తగా 1,938 కరోనా కేసులు
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 22,427 దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 6.6 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 1,938 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 2,531 మంది కరోనా నుంచి కోలుకోగా… 67 […]
నాడు రైతులతో..నేడు దేశ జవాన్లతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటుంది – కేటీఆర్
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన ఫై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు. రక్షణశాఖ ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా యువత ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. గత నాల్గు రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆర్మీ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను […]