ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

రఘురామకృష్ణరాజు రిమాండ్ పొడిగింపు

రఘురామకృష్ణరాజు రిమాండ్‌ను సిఐడీ కోర్టు ఈ నెల 25 వరకు పొడిగించింది. సుప్రీం ఆదేశాల ప్రకారం గత నెల 28న రఘురామకృష్ణరాజుకు ఇద్దరు పూచీకత్తు బెయిల్‌పై విడుదల చేశారు. మే 28 నుంచి జూన్‌ 10 వరకు రఘురామకృష్ణరాజు బెయిల్‌పై సంతకాలు పెట్టలేదు. ఈ కారణంగా బెయిల్‌ బాండ్‌ షూరిటీలను రఘురామకృష్ణరాజు సంతకం లేకుండానే జైలు అధికారులు కోర్టుకు తిప్పి పంపారు.

కాగా రఘురామకృష్ణరాజు ఇంకా కస్టడీ నుంచి రిలీజ్ కాలేదని భావించాల్సి వస్తుందని సీఐడీ కోర్టు తెలిపింది. రఘురామకృష్ణరాజు సంతకాలు చేయకపోవడంతో రిమాండ్ వారెంట్‌ జిల్లా జైలు వద్ద పెండింగ్‌లో ఉందని సీఐడీ కోర్టు తెలిపింది.