తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..ఈ నెల 15 యాదాద్రి దేవాలయానికి వెళ్లనున్నారు. యాదాద్రి నరసింహ స్వామి దేవాలయానికి అనుబంధ ఆలయంగా ఉన్న పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వర స్వామి శివాలయం పునః ప్రారంభ కార్యక్రమం కోసం కేసీఆర్ యాదాద్రికి వెళ్లేందుకు షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. రేపటి నుండి అనగా ఏప్రిల్ 20 నుంచి ఐదు రోజుల పాటు మహా కుంభాభిషేక మహోత్సవాలు జరగనున్నాయి. 25వ తేదీన ఉదయం 10 : 25 గంటలకు ఈ శివాలయం పునః ప్రారంభం కానుంది. ఈ పునః ప్రారంభ కార్యక్రమానికి కేసీఆర్ హాజరుకానున్నట్లు సమాచారం.
కాగ ఈ ఉత్సవాలను తొగుల పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో జరగనున్నట్టు ఆలయ ఈవో గీత తెలిపారు. కాగ ఇటీవల యాదాద్రి నరసింహ స్వామి ఆలయాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పునః నిర్మించిన విషయం తెలిసిందే. అనంతరం యాదాద్రి ఆలయాన్ని ప్రారంభించారు. అయితే ఇప్పుడు.. ఈ శివాలయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పునః నిర్మించడం విశేషం.