ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

ఏపీ ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారు : చంద్ర‌బాబు

మూడు రోజుల జిల్లాల పర్యటన అద్భుతంగా కొన‌సాగిందన్న చంద్ర‌బాబు

ఏపీలో తాను చేప‌ట్టిన మూడు రోజుల జిల్లాల పర్యటన అద్భుతంగా కొన‌సాగిందని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు చెప్పారు. ఏపీ ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారని ఆయ‌న అన్నారు. ఏడు జిల్లాల్లో లక్షల మందికి చేరువగా పర్యటన సాగిందని చెప్పారు.

ప్ర‌జ‌ల‌పై పన్నులు, అధిక ధ‌ర‌ల భారం ప‌డింద‌ని, దీనిపై ప్రజలు త‌న ముందు ఆవేదన చెందార‌ని ఆయ‌న అన్నారు. వారి ఆవేద‌న‌ ప్రభుత్వ వ్యతిరేకతను చాటిందని, ప్ర‌జ‌లు మార్పును కోరుకుంటున్న తీరు స్పష్టమైంద‌ని అన్నారు. ప్రజల్లో టీడీపీపై ఆసక్తి రానున్న మార్పును సూచిస్తున్నాయని తెలిపారు. త‌న ప‌ర్య‌ట‌న‌ను విజ‌య‌వంతం చేసిన‌ కార్యకర్తలు, ప్రజలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.