తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు గురువారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని కొంగరకలాన్‌లో నిర్మించిన రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించారు. కొంగరకలాన్‌లోని సర్వే నంబర్ 300లో 44 ఎకరాల్లో రూ. 58 కోట్ల వ్యయంతో మూడు అంతస్తుల్లో, వందకు పైగా విశాలమైన గదులతో కలెక్టరేట్ సముదాయాన్ని నిర్మించారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, కలెక్టర్ అమయ్ కుమార్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు మహేశ్వరం, కల్వకుర్తి, షాద్‌నగర్, రాజేంద్రనగర్, చేవెళ్ల, ఎల్బీనగర్ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/