ఏపీలో ఎన్నికల కసరత్తు వేగవంతం అయింది. ఎన్నికలకు ప్రధాని పార్టీలు సిద్దం అవుతున్నాయి. ఎన్నికల అజెండాలు ఫిక్స్ చేస్తున్నాయి. ఈ సమయంలో వైసీపీ మూడు రాజధానుల నినాదంతో ముందుకు వెళ్తోంది. టీడీపీ, ప్రతిపక్షాలు అమరావతికి మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ సమయంలోనే ఈ నెల 11న సుప్రీంకోర్టు అమరావతి పైన విచారణ చేపట్టనుంది. ఈ మరుసటి రోజునే ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. దీంతో, ఉత్కంఠ పెరుగుతోంది.
సుప్రీంలో అమరావతి కేసు విచారణ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చింది. దీంతో అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది.