snail-4
అంతర్జాతీయం ముఖ్యాంశాలు

కరోనా తర్వాత మళ్ళీ మొదలైన నత్తల రేసింగ్.. ఈ ఏడాది ఛాంపియన్ నత్త ఎన్ని సెకన్లలో గెలిచిందంటే..

మీరు ఎప్పుడైనా కీటకాల రేసింగ్ ఛాంపియన్‌షిప్ గురించి చూశారా లేదా విన్నారా? ఇంగ్లండ్‌లో వరల్డ్ నత్త రేసింగ్ ఛాంపియన్‌షిప్ ఉందని, అందులో నత్తలు రేసులో పాల్గొంటాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ ఏడాది విజేతగా నిలిచిన నత్త పేరు ఈవీ.

ప్రపంచవ్యాప్తంగా మారథాన్, సైకిల్ రేస్, బైక్ రేస్, కార్ రేస్ వంటి అనేక రకాల పోటీలు ఉన్నాయి. అంతే కాకుండా చాలా చోట్ల కొన్ని రకాల విచిత్రమైన పోటీలు ఉన్నాయి. వీటిలో హై హీల్ డ్రాగ్ క్వీన్ రేస్, చీజ్ రోలింగ్ , ఎక్స్‌ట్రీమ్ ఇస్త్రీ ఉన్నాయి. అయితే కీటకాల రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లు జరిగే స్థలం కూడా ఉందని మీకు తెలుసా?

ఇంగ్లండ్‌లో జరిగే ఈ పోటీ పేరు వరల్డ్ నత్త రేసింగ్ ఛాంపియన్‌షిప్. ఇందులో నత్తల మధ్య రేసు ఉంటుంది. ఇటీవల ఈ వింత పోటీ నిర్వహించారు. ఈ రేసులో ఈవీ అనే నత్త విజేతగా నిలిచింది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం కోవిడ్ కారణంగా ఈ రేసింగ్ ఛాంపియన్‌షిప్ 2020 సంవత్సరంలో నిర్వహించలేదు. 

ఈ ఏడాది ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న నత్త రేసును పూర్తి చేయడానికి మొత్తం 7 నిమిషాల 24 సెకన్లు పట్టింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏంటంటే.. గెలిచిన నత్తకు పారితోషికంతో పాటు వెండి కప్పుని కూడా  బహుమతిగా ఇచ్చారు. ఈ పోటీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా నమోదైంది. 

నివేదికల ప్రకారం ఈ పోటీ టేబుల్‌పై ప్రారంభమై టేబుల్‌పైనే ముగుస్తుంది. ఇందులో నత్తలు 13 అంగుళాలు మాత్రమే పరుగెత్తాలి. అన్ని నత్తలు ఒకే రకమైనవి కనుక వాటిని గుర్తించడానికి వాటి షెల్స్‌పై స్టిక్కర్లు లేదా రేసింగ్ నంబర్‌లు రాస్తారు.

ఈ వింత పోటీలు 1960లలో ప్రారంభమైంది. ఈ ఛాంపియన్‌షిప్  గొప్పదనం ఏమిటంటే.. నత్తల రేసింగ్  నిర్వాహకులు సొంతంగా నత్తలను పెంచుతారు. ఈ రేసింగ్ లో పాల్గొనాలనుకునేవారు ఇంటి నుంచి సొంత నత్తలను తెచ్చుకోవచ్చు. లేదా రేసింగ్ ను నిర్వహించేవారి దగ్గర నుంచి నత్తలను ఎంచుకోవచ్చు. ఈ నత్తల పోటీని నిర్వాహకులు ‘రెడీ, స్టెడీ, స్లో’ అంటూ ప్రారంభిస్తారు.