ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలు నిహారిక పెళ్లి వేడుక హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు సినీ , రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. హైదరాబాద్‌కు చెందిన రవితేజను నిహారిక వివాహం చేసుకున్నారు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఎరినాలో ఈ పెళ్లి వేడుక జరిగింది.
ఈ పెళ్లి వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. అలాగే, తెలుగు చిత్రసీమకు చెందిన ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, అక్కినేని నాగార్జున హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.