తన తండ్రి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 14వ వర్ధంతి కావడంతో ఆయన కొడుకు, వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి… ఇవాళ కడప జిల్లాలోని ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్‌లో ఆయన సమాధికి నివాళులు అర్పించారు ఆ తర్వాత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో.. తల్లి విజయమ్మ కూడా అక్కడే ఉన్నారు.
ఉదయాన్నే ఇడుపులపాయకు వెళ్లిన సీఎం జగన్ చెల్లి షర్మిల.. తండ్రి సమాధికి నివాళులు అర్పించి కాసేపు ప్రార్థనలు చేశారు. వైఎస్ భార్య, షర్మిల తల్లి విజయలక్ష్మి కూడా ఆ సమయంలో నివాళులు అర్పించి, ప్రార్థనల్లో పాల్గొన్నారు. తెలుగు వారికి వైఎస్‌ఆర్ చేసిన సేవలను గుర్తుచేసుకున్న షర్మిల.. అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని అన్నారు.
తన తండ్రి లేని లోటును గుర్తుచేసుకున్న జగన్.. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. తండ్రి చేసిన సేవల్ని స్మరించుకున్నారు. ఇదివరకు వైఎస్ జయంతి నాడు.. షర్మిల, జగన్ కలవలేదు. అలాగే.. ఇవాళ కూడా వారు కలవలేదు. షర్మిల ఆల్రెడీ హైదరాబాద్‌కి వెళ్లిపోయారు. సీఎం జగన్ ఒంటిగంటకు ప్రత్యేక విమానంలో విజయవాడ ఎయిర్‌పోర్టుకి వెళ్తారు.