ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

AP covid-19 Cases | ఏపీలో కొత్తగా 1,393 కరోనా కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,393 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 1,296 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. మరో ఎనిమిది వైరస్‌ ప్రభావంతో మృత్యువాతపడ్డారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,36,179కి పెరిగింది. ఇప్పటి వరకు 20,07,330 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌ బారినపడి 14,052 మంది బాధితులు మరణించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 17,797 యాక్టివ్‌ కేసులున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. కరోనాతో చిత్తూరులో ముగ్గురు, కృష్ణాలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఒకరు మృతి చెందారని పేర్కొంది. తాజా కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 272, తూర్పుగోదావరిలో 206, నెల్లూరులో 201, కృష్ణాలో 162, గుంటూరులో 132, పశ్చిమగోదావరిలో 129, ప్రకాశంలో 120 మంది వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్ష చేసినట్లు వివరించింది.