తెలంగాణ రాజకీయం

నిరుపేదలకు నీడ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతింటి కల నెరవేర్చాలని ఉద్దేశంతో ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి అర్హులైన నిరుపేదలందరికీ నీడ కల్పిస్తోందని ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి ఆలోచనతో పారదర్శకంగా కేటాయిస్తున్నారని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని దమ్మైగూడ మున్సిపల్ అహ్మద్ గూడ లో శనివారం ముషీరాబాద్ మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాలకు చెందిన 1500 మంది లబ్ధిదారులకు మంత్రి మల్లారెడ్డి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఠా గోపాల్ ఆధ్వర్యంలో అలాట్మెంట్ సర్టిఫికెట్లను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ అర్హత కలిగిన పేదలకు అన్ని వసతులతో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి పేదలకు అందజేస్తున్నట్లు, ఇంత గొప్ప పథకం దేశంలో ఎక్కడ అమలు కావడం లేదన్నారు. సీఎం కేసీఆర్ కలసాకారమైన రోజు ఎంత గొప్ప రోజు అన్నారు. ఎలాంటి పైరవీలు రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పారదర్శకంగా కేటాయిస్తున్నట్లు ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించామన్నారు. మిగిలిన అర్హత కలిగిన వారందరికీ రెండు, మూడు, నాలుగు విడతల్లో ఇళ్ల పంపిణీ చేస్తామని ఇది నిరంతర ప్రక్రియ అన్నారు.
గృహలక్ష్మి పథకం కింద రూ 3 లక్షలు

ప్రస్తుతం లబ్ధిదారులకు అందజేసిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అన్ని వసతులతో కూడుకున్నవని లబ్ధిదారులు తమ వీలును బట్టి గృహప్రవేశాలు చేసుకోవాలన్నారు. పేదలపై ఒక్క రూపాయి భారం లేకుండా అన్ని వసతులతో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కొత్తగా గృహలక్ష్మి పథకం కింద ఇల్లు కట్టుకునే వారికి రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్ టీ హబ్ తీసుకువచ్చి ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని ఒక హైదరాబాద్ లోనే ఐటీ రంగంలో 9 లక్షల మంది ఉద్యోగస్తులు పనిచేస్తుండటమే ఇందుకు నిదర్శనం అన్నారు.

ముషీరాబాద్ ఎమ్మెల్యే ముటాగోపాల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గా యాదవ్ దయాకర్ రెడ్డి దమ్మైగూడ మున్సిపల్ చైర్ పర్సన్ ప్రణీత గౌడ్ వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్ రెడ్డి జవహర్ నగర్ మేయర్ కావ్య ఆర్డీవో రాజేష్ కుమార్ వివిధ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు