చట్టం దృష్టిలో చంద్రబాబు అయినా ఒకటే మరో బాబు అయిన ఒకటే అని …చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై స్పందించిన ఎమ్మెల్యే రాష్ట్రంలో జరిగిన పరిణామాలు ప్రజల దృష్టిలో ఉన్నాయి.. స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. రోడ్డు మార్గం ద్వారా విజయవాడ తరలిస్తున్నారు.. సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ కేసుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించారని గుర్తుచేశారు. కొన్ని మీడియా సంస్థలు చంద్రబాబు అరెస్ట్ తప్పు అంటూ వాదనలు చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. 90 శాతం సిమెన్స్, 10 శాతం ప్రభుత్వం ఖర్చు చేయాలి.. రూ.3,356 కోట్ల ప్రాజక్ట్ లో రూ.371 కోట్లు ప్రభుత్వం ఇవ్వాలి.. ఏ కారణం లేకుండా ఒక కంపెనీ ప్రభుత్వం తరపున రూ.3000 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తుందని ప్రశ్నించారు.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, ఈడీ అరెస్టులు చేశాయి అని తెలిపారు.సీమెన్స్, డిజిటెక్, స్కిల్లెర్ కంపెనీల ప్రతినిధులను ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ చేశారు..
వారంతా ఈ కుట్రలో పాత్రధారులు… సిమెన్స్ కంపెనీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. కేవలం ప్రభుత్వం 10 శాతం కింద ఇచ్చిన 371 కోట్ల రూపాయలను మింగేశారని ఆరోపించిన ఆయన.. షెల్ కంపెనీల ద్వారా డబ్బులు బదలాయించారు.. ఆ డబ్బులు అన్ని చంద్రబాబుకు, ఆ పార్టీ వారికే చేరాయన్నారు. ఇది చంద్రబాబు నాయుడు స్వయంగా చేసిన స్కాం కాబట్టే.. అయన ఈ విషయంపై ఏమి మాట్లాడలేదని దుయ్యబట్టారు. అయన పార్టీ వారిని పెట్టుకుని అడ్డగోలుగా వాదిస్తుంటే.. చంద్రబాబు.. సీఐడీని నిలదీశారని ప్రచారం చేసుకుంటున్నారు.. ఐటీ నోటీసులు ఇస్తే.. ఆ సర్కిల్ నోటీసు ఇవ్వకూడదని అడ్డగోలు వాదనలు చేశారి ఆగ్రహం వ్యక్తం చేశారు.