తెలంగాణ రాష్ట కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సీటీలో త్రైలోక్య మోహన చండీ హోమం ను నిర్వహించారు మంత్రి మల్లారెడ్డి,కుటుంబసభ్యులు..ఈ త్రైలోక్య మోహన చండీ హోమం కార్యక్రమానికి ఎంఎల్ఎ వివేకానంద,ఎంఎల్ సి శంభీపూర్ రాజు,సురభివాణి దేవి తో పాటు పలువురు నాయకులు హజరై త్రైలోక్య మోహన చండీ హోమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.మేడ్చల్ నియోజకవర్గ డ్వాక్రా మహిళలందరికి తన బర్త్ డే ను పురస్కరించుకొని ఫ్రీ మెడికల్ హెల్త్ కార్డ్స్ పంపీణీ చేశారు మంత్రి మల్లారెడ్డి..
మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తన బర్త్ డే సందర్బంగా చండీ యాగం నిర్వహించామని మళ్లీ సియం కేసిఆర్ భారీ మెజారిటీ తో ప్రభుత్వాన్ని ఎర్పాటుచేయాలని యాగం నిర్వహించామన్నారు..తన బర్త్ డే సందర్బంగా తన మేడ్చల్ నియోజకవర్గ డ్వాక్రా గ్రూప్ మహిళలందరికి ఫ్రీ హెల్త్ కార్డ్స్ మంజూరు చేశామని అన్నారు..దేవుడి దయ కేసిఆర్ ఆశీర్వాదంతో ప్రజాసేవే లక్య్షంగా కుటుంబమంత ప్రజాసేవ చేస్తున్నామన్నారు..దేశంలోనే అన్ని రాష్ట్రాల్లో సియం కేసిఆర్ ముందుచూపుతో నెం1రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం సిద్దించిందన్నారు..మల్లారెడ్డి మెడికల్ హబ్ డైరెక్టర్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ కోరిన కోర్కెలు తీర్చి భాదలనుండి విముక్తి కలిగించే అమ్మవారిని రాష్ట్ర ప్రజలను,దేశ ప్రజలను చల్లగా చూడాలని యాగం చేసినట్టు తెలిపారు..రాష్ట్రంలో మరోమారు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు మరిన్ని సంక్షేమపలాలు అందేలా చూడాలని అమ్మవారిని కోరినట్టు మీడియాకి తెలిపారు..