quash
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

చంద్రబాబు కేసు విచారణ వారం రోజులు వాయిదా వేసిన హైకోర్టు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై దాఖలు అయిన  క్వాష్ పిటిషన్ విచారణ హైకోర్టు ఈ నెల 19 కి వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్ పై తమ కౌంటర్ వేయడానికి సిఐడి  సమయం కోరింది. దాంతో సిఐడికి సమయం ఇస్తూ కోర్టు విచారణను వాయిదా వేసింది. ఆదే సమయంలో ఏసీబీ కోర్టులో సిఐడి వేసిన కస్టడీ పిటిషన్ పై విచారణను మంగళవారం వరకు ఆపివేయాలని ఆదేశించింది. సీఐడీ కస్టడీకి చంద్రబాబును ఇవ్వొద్దని కోర్టును ఆయన తరపున వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టును కోరారు.  ఈ కేసులో చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని. మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును అరెస్ట్ చేసే ముందు రాష్ట్ర గవర్నర్ అనుమతి తీసుకోలేదని ఆయన చెప్పారు.  

ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తూ చంద్రబాబుపై విచారణ ప్రాథమిక దశలో ఉందని ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరారు. మరోవైపు, అమరావతి ఇన్నర్ రింగ్ రొడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై కుడా విచారణ వారం రోజులకు వాయిదా పడింది.