తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో రాష్ట్రంలో అనేక జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు హైదరాబాద్ వేదిక అవుతోందని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు. ఎల్‌బి స్టేడియం (బాక్సింగ్ హాల్)లో రేపు ప్రారంభం కానున్న ‘థాయ్ బాక్సింగ్’ పోటీల పోస్టర్‌ను ఆయన ఈరోజు తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్‌తోనే గత దశాబ్ది కాలం నుండి అనేక క్రీడా సంఘాలకు ఇచ్చిన సహకారంతోనే అనేక జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు హైదరాబాద్ వేదిక అయిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఒకవైపు గ్రామంలో క్రీడా మైదానాలు నిర్మించి, గ్రామీణ క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తూ, మరొకవైపు ప్రఖ్యాత క్రీడలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించి, హైదరాబాద్‌ను క్రీడల హబ్‌గా తీర్చిదిద్దిందని నిరంతర క్రీడా కార్యక్రమాల
నిర్వహణ, క్రీడాకారుల ప్రోత్సాహం ఉండే విధంగా కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు. వినూత్న క్రీడా కార్యక్రమాలకు తెలంగాణ నెలవు కావడంతో ఎంతోమంది ఔత్సాహిక క్రీడాకారులకు స్ఫూర్తి లభిస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ‘థాయ్ బాక్సింగ్’ పోటీల విజయవంతానికి సంపూర్ణ సహకారం అందజేస్తుందని డాక్టర్ ఆంజనేయ గౌడ్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గౌతమ్ చుబుకేశ్వర్, మహారాష్ట్ర శాసన సభ్యుడు (శివసేన, ఉద్ధవ్‌థాక్రే వర్గం), తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి కె. జగదీశ్వర్ యాదవ్, ఒలంపిక్ అసోసియేషన్ ప్రతినిధులు డా॥ ఎస్. ఆర్. ప్రేమరాజ్, డా॥ వెంకటేశ్వర రెడ్డి, థాయ్ బాక్సింగ్ ఆఫ్ ఇండియా ఫెడరేషన్ అధ్యక్షుడు సంతోష్ ఖైర్నార్, ప్రతినిధులు హాజి దస్తగిర్ మనియార్, పి. వై. అట్టార్, కె. యూనస్, ఇంతియాజ్ మీర్జాబేగ్, అల్‌హాజ్ మహమ్మద్ సబీర్, డా॥ కె. నర్సయ్య తదితరులు పాల్గొన్నారు