enugu sudarshan
తెలంగాణ రాజకీయం

జనం కోసం బిజెపి జంగు సైరన్..

మేడ్చల్ నియోజకవర్గ ఎంఎల్ఏ అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డీ భాజపా మేడ్చల్ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బైక్ ర్యాలీతో పాటు మేడ్చల్, దేవరయాంజల్,పోతాయిపల్లి,తూంకుంట ప్రచార ర్యాలీలో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతీ మండల మున్సిపాలిటీ గ్రామాలలో టపాసులు కాల్చుతూ, గజమాలతో బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు . ఈ సందర్బంగా సుదర్శన్ రెడ్డీ మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి కోట్ల రూపాయలు ఇచ్చి ఎమ్మెల్యే ఎంపీ, టికెట్లు కొనుగోలు చేసి మండల మున్సిపాలిటీ కార్పొరేషన్ లలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఏ ఒక్క నిరుపేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు డబుల్ బెడ్ రూమ్ లు రేషన్ కార్డులు అందివ్వలేదని మంత్రి మల్లారెడ్డి పై  తీవ్ర స్థాయి లో విరుచుక పడ్డారు. మంత్రి మల్లారెడ్డి ఆగడాలకు అడ్డుకట్టవేసి ఆయనకు తగిన బుద్దిచెప్పెందుకే మేడ్చల్ గడ్డమీద పోటీచేస్తున్నట్లు చెప్పారు. మేడ్చల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలల్లో అభివృద్ధి చేస్తా,మీ అందరికి అండదండగా ఉంటా!! మీకు నాయకునిగా కాదు, మీకు సేవకునిగా పనిచేస్తా, మీ తలలో నాల్కనై చట్టసభలలో మీ గొంతుకనై ఉరుముతా! అవినీతిపరుల అంతుచుస్తా కుళ్ళిన రాజకీయాన్ని కడుగుతా!!  

నీళ్లు నిధులు నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో మారుతున్న రాజకీయాలకు నేటి యువత ఆదర్శంగా ఉండాలని విజ్ఞప్తి చేసారు.   కెసిఆర్ తెలంగాణను10ఏళ్ళు నాశనం చేసిండు, కాంగ్రెస్ 6 హామీలు పచ్చి దగాకోరు హామీలు, బీసి ప్రధాని నుండి బీసీ సీఎం వరకు ఒక్క బీజేపీకి మాత్రమే సాధ్యం నరేంద్ర మోడీగారు ఓసీలకు 10%రిజర్వేషన్ కల్పించారు, మన రాష్టంలో బీజేపీ కేంద్రప్రభుత్వం1400 మందికి ఉద్యోగాలు ఇచ్చిందని,ప్రతి సంవత్సరం వరితో పాటు అన్ని పంటలకు  మద్దతు ధర పెంచుతున్నది నరేంద్ర మోడి ప్రభుత్వం, కానీ రాష్ట్ర ప్రభుత్వము కనీసం పండిన పంటను సరిగ్గా కొనుగోలు  చేయటం లేదు, రైతు బంధు పేరుతో రైతులకు రావలసిన అన్ని సబ్సిడీలను ఎత్తివేసిన కెసిఆర్ సర్కార్ రైతుల పాలిట శాపంగా మారింది, కేంద్ర ప్రభుత్వ పసల్ భీమా యోజన తెలంగాణలో అమలు చేయటం లేదు, రైతులకు సబ్సిడీతో యూరియా, అమోనియా వంటి ఎరువులను అందిస్తున్నది కేంద్ర ప్రభుత్వం, మరి బిఅర్ఎస్ ప్రభుత్వం ఇస్తానన్న ఉచిత యూరియా హామీ పథకం ఏమైంది అనీ బిఅర్ఎస్ పై ద్వజమెత్తారు.

బిఅర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబ సొత్తు కాంగ్రెస్ పార్టీ సోనియా కుటుంబ సొత్తు కాని బిజెపి”బడుగు బలహీనవర్గాల”సొత్తు తనను గెలిపిస్తే ఉచిత విద్యా, వైద్యం,ప్రతీ నిరుపేద కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రతీ ఇంటికి ఉచితంగా నల్లా నీళ్లు అర్హులైన పేద ప్రజలకు రేషన్ కార్డులు మంజూరు చేపిస్తానని హామీ ఇచ్చారు.బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటితో తనను  గెలిపించాలని విజ్ఞప్తి చేసారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ మండలాల అధ్యక్షులు,బీజేపీ రాష్ట్ర నాయకులు,జిల్లా నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.