bajireddy
తెలంగాణ రాజకీయం

మూడు పంటల బీఆర్ఎస్ కావాలా..?

రూరల్ నియోజకవర్గానికి వరప్రదాయినిగా చేద్దామనుకుని పనులను ప్రారంభిస్తే కావలని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కొన్ని గ్రామాల్లో ప్రజలను అయోమయానికి గురి చేసి ఉసిగొల్పడం వల్లనే పనులు పూర్తి కాలేదని దూస్ గాం, నక్కలగుట్ట, గొల్లమట్ తండాలకు పైపులైన్ లేక కాలువల ద్వారా నీటిని అందజేయటానికి తన వంతు కృషి చేస్తున్నానని, ఎన్నికలు ముగిసిన వెంటనే మిగిలిన పనులను పూర్తి చేసే బాధ్యత నాపై ఉందని బీఆర్ఎస్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మండలంలోని నక్కలగుట్ట తండా, గొల్లమట్ తండా, నడిమితండా, దూస్ గాం తండా, దూస్ గాం, ఖిల్లా డిచ్పల్లి గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలనుద్దేశించి బాజిరెడ్డి మాట్లాడారు. గతంలో పాలించిన పాలకులు గ్రామాలను అన్ని వర్గాల ప్రజలను విస్మరించి పాలన చేశారని గతంతో పోల్చుకుంటే ఏ గ్రామం చూసినా కోట్ల రూపాయలతో అభివృద్ధి చేపట్టం జరిగిందన్నారు. సిఎం కేసీఆర్ దళితులను ఆదుకోవడానికి వారికి సముచిత స్థానం కల్పించడానికి దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని, ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అన్నారు.

ఇతర వర్గాల వారికి బీసీ బంధు, మైనార్టీ బంధు అందజేస్తున్నామన్నారు. బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్నా 1200 లకు గ్యాస్ సిలిండర్ చేసి పేదల నడ్డి విరిచిందని, మహిళలకు కట్టెల పొయ్యిలే శరణ్యమనే తరుణంలో కేసీఆర్ ఈసారి అధికారంలోకి వచ్చిన వెంటనే 400 లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామన్నారు. నేటి నుండి రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ అవుతుందని కావలని కాంగ్రెస్కు చెందిన రేవంత్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి ఎలక్షన్ కమీషన్కు ఫిర్యాదు చేసి రుణమాఫీ, రైతుబంధు నిలుపుదల చేశారని, అలాంటి వారిని రైతులు, ప్రజలు నమ్మొద్దన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల పాటు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తుంటే కాంగ్రెస్ నాయకులు 3 గంటలే సరిపోతుందని హేళన చేశారన్నారు.

ఎక్కడ చూసినా పచ్చని పంట పొలాలతో చేతికొచ్చిన వరిధాన్యాన్ని గ్రామాల్లో కొనుగోళ్లు సొసైటీల ద్వారా చేసి నేరుగా రైతు ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్న సర్కార్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటేనన్నారు. బీడీ కార్మికులకు కటాప్ డేట్ను ఎత్తివేస్తామని ప్రకటించారని, అధికారంలోకి వచ్చిన వెంటనే బీడీలు చేసే వారికి పింఛన్ అందజేస్తామని, అంతేగాక ప్రతిఒక్కరికి 3 వేల పింఛన్ను అందజేస్తామన్నారు. కాంగ్రెస్, బీజేపీలు మాట్లాడే ఉత్తుత్తి మాటలు నమ్మొద్దని 5 గ్యారంటీలని చెప్పి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ ఇవ్వక రైతుల పంట పొలాలు ఎండుముఖం పట్టాయని గతంలో పాలించినప్పుడు గ్రామాల అభివృద్ధి పట్టించుకోలేదని ఇప్పుడు చేస్తామంటే ఎలా నమ్ముతామన్నారు. గ్రామాలకు వస్తే వారిని నిలదీయాలన్నారు. పెన్షన్కు క్రమక్రమేనా 5 వేలకు పెంచుతామని, అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అమలు చేస్తున్నామన్నారు. ఆలయాలు, మజీద్లు, చర్చిలకు, గురుద్వారాలకు నిధులను కేటాయిస్తూ అభివృద్ధి చేస్తున్నామన్నారు.

కార్యక్రమంలో రూరల్ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, మండల అధ్యక్షులు చింత శ్రీనివాస్డ్డి, జడ్పీటీసీ దాసరి ఇందిరా లక్ష్మీనర్సయ్య, సర్పంచ్లు గడ్డం రాధాకృష్ణరెడ్డి, గంగారాం, సొసైటీ చైర్మన్ గజవాడ జైపాల్, ఖిల్లా రామాలయ చైర్మన్ మహేందర్రెడ్డి, శక్కరికొండ కృష్ణ, రవీందర్, గోపు నడిపిఅన్న ,నల్లవెల్లి సాయిలు, పద్మారావు, గజవాడ రాములు, ప్రతాప్రెడ్డి, కిష్టారెడ్డి, విఠల్ రాథోడ్, అంబర్సింగ్, పైజల్ పాషా, కోఆప్షన్ సభ్యులు నయీం, పవన్, దండుగుల సాయిలు, మోహరెడ్డి టిఆర్ఎస్ పార్టీ అన్ని అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.