‘కొవిన్ గ్లోబల్’ సమావేశంలో నేడు ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడి మాట్లాడుతూ…కరోనా నుంచి బయటపడడానికి ‘వ్యాక్సినేషన్’ ఏకైక మార్గమని మోడి అన్నారు. వ్యాక్సినేషన్ మొదటి నుంచి తాము దేశంలో డిజిటల్ వ్యూహాన్ని అనుసరించాలనే తాము వ్యూహం పన్నామని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టేందుకు భారత్ వినియోగిస్తున్న డిజిటల్ వేదికే కొవిన్. కరోనాపై పోరులో భాగంగా ఈ ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌ను దాదాపు 50 దేశాలకు ఉచితంగా అందించేందుకు భారత్ సిద్ధమైంది. దేశ విదేశాలకు చెందిన ఆరోగ్య రంగ నిపుణులు ఈ సదస్సులో పాలుపంచుకున్నారు.
ప్రపంచమంతా ఒకే కుటుంబం అన్న విధానాన్ని భారతీయులు గట్టిగా విశ్వసిస్తారని, మహమ్మారి తర్వాత చాలా మంది విదేశీయులు కూడా ప్రస్తుతం ఈ సూత్రాన్ని బలంగా విశ్వసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అందుకే కొవిన్ టెక్నాలజీని విశ్వవ్యాపితం చేయడానికి ఓపెన్ సోర్స్‌గా ఉంచినట్లు మోడి తెలిపారు.