sajjala-sharmila
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

షర్మిల చేరడం వెనుక చంద్రబాబు హస్తం

వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ లో చేరడం వెనక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుట్ర ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృ ష్ణారెడ్డి ఆరోపించారు.షర్మిల రాజకీ యంగా ఎక్కడ నుంచి అయినా ప్రాతినిధ్యం వహించవచ్చని తెలిపారు. షర్మిల వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదని తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి భవితవ్యం లేదని.. అలాంటి పార్టీని తాము పట్టించుకోమని తెలిపారు. అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగం సమంజసమేనని అన్నారు. అంగన్వాడీల సమ్మెతో చిన్నపిల్లలు, గర్భిణులు ఇబ్బంది పడుతున్నారని.. వాళ్ల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పారు. అత్యవసర సర్వీసుల కింద అంగన్వాడీలు ఉన్నారని.. వారు తిరిగి వీధుల్లో చేరాలని అనేకసార్లు విజ్ఞప్తి చేశామన్నారు. అయినా వారు ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించారని.. అందుకే ఎస్మా చట్టాన్ని ప్రయోగించామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.