జాతీయం ముఖ్యాంశాలు

హిమాచల్‌ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం

హిమాచల్‌ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని గిరిజన జిల్లా అయిన కిన్నౌర్‌లో శుక్రవారం రాత్రి భూమి కంపించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 3.1గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (ఎన్‌సీఎస్‌) వెల్లడించింది. కిన్నౌర్‌ జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. శుక్రవారం రాత్రి 11.32 గంటల సమయంలో భూకంపం సంభవించినట్లు పేర్కొన్నది. భూకంపం వల్ల జరిగిన ఆస్థి, ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.