inter result
ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

ఇవాళ ఇంటర్ రిజల్ట్స్

ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 12న విడుదల కానున్నాయి. ఏప్రిల్ 12న ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ప్రకటించనున్నారు. తాడేపల్లిలోని కార్యాలయంలో ఇంటర్ బోర్డు సెక్రటరీ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఏప్రిల్ 11న అధికారిక ప్రకటన విడుదల చేసింది. పరీక్షలు పూర్తయిన 22 రోజుల్లోనే  రికార్డుస్ధాయిలో ఇంటర్‌ బోర్డు ఫలితాలు ప్రకటించనుంది.ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 1,559 సెంటర్లలో మార్చి 1వ తేదీ నుంచి 20 వరకు ఇంటర్ ప‌బ్లిక్‌ పరీక్షలు జ‌రిగిన విష‌యం తెల్సిందే. ఈ ఏడాది ఇంట‌ర్ విద్యార్థులు మొత్తం 10,52,221 మంది ఉన్నారు. ఇందులో మొదటి  సంవత్సరం 4,73,058 మంది, రెండో  సంవత్సరం 5,79,163 మంది ఉన్నారు. ఒకేషనల్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు దాదాపు లక్ష వరకు ఉన్నారు. ఇంటర్ పరీక్షలు ముగియడంతో.. మూల్యాంకన ప్రక్రియ కూడా మొదలుపెట్టారు. ఏప్రిల్‌ 4లోపు మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేసేలా బోర్డు అధికారులు ఆదేశాలు ఇచ్చారు.

ఈ వాల్యుయేషన్ ప్రక్రియలో సుమారుగా 23వేల మంది అధ్యాపకులు  పాల్గొంటున్నారు. ఒక్కో అధ్యాపకుడూ రోజుకు 30 జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తారు. ఈ లెక్కన రోజూ 8 గంటల పాటూ వాల్యుయేషన్ చేస్తే.. గంటకు 4 పేపర్లను పరిశీలించాల్సి ఉంటుంది. అంటే పావు గంటకు ఒక పేపర్ పూర్తవ్వాలి. ఇది కొంతవరకూ సాధ్యమే. ఐతే.. విద్యార్థులు ఈ రోజుల్లో తెగ రాస్తున్నారు. విపరీతమైన పోటీలో.. ఎడిషన్ల మీద ఎడిషన్లు తీసుకొని రాస్తున్నారు. అందువల్ల వాల్యుయేషన్ చెయ్యడం అంత ఈజీ కాదనే వాదన ఉంది. అయినా అధ్యాపకులు మాత్రం చకచకా పని కానిస్తున్నారు