పులివెందులలో పిసిసి మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి మీడియాతో మట్లాడారు. ఈ నెల 20న కడప కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్దిగా షర్మిల నామినేష వేస్తారు. త్వరలో వైయస్ షర్మిల , వైయస్ సునీత ఇంటింటా ప్రచారం మొదలు పెట్టనున్నారు. కడప పార్లమెంట్ పులివెందుల అసెంబ్లీ స్దానం కాంగ్రెస్ పార్టీ కంచుకోట. రాహూల్ గాంధీని పిఎం చెయ్యాలన్నది దివంగత వైఎస్అర్ అశయం. వైయస్ షర్మిలాను ఎంపీ ని చేయడమే వైయస్ వివేకానందరెడ్డి లక్ష్యమని ఆ లక్ష్యం కోసమే తాను పనిచేస్తున్నానని వైఎస్ సునీత తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ రావాలి… అందులో కడప గెలవాలన్నది లక్ష్యం. పులివెందుల అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిపోయింది. రోడ్లు అధ్వాన్నంగా మారాయి. భూలోకంలో యమలోకం చూస్తున్నాము. సంక్షేమం బటన్ నొక్కింది నిజమే. బటన్ నొక్కి నీవు ఇచ్చింది ఎంత వసూళు చేసింది ఎంత. రాష్టంలోని కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది.
రాష్ట్రంలో వైసిపి టిడిపి జనసేన మూడు పార్టీలు బిజేపికి దాసోహం అయ్యాయని అన్నారు. కబాలిలా జగన్ మారిపోయాడు. దేశంలో బిజేపి అంటే భారతీయ జనతా పార్టీ. కానీ ఎపిలో బిజేపి అంటే వైసిపి. అందుకే మళ్లీ ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ గెలవాలి. అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు…..