138 వ ప్రపంచ కార్మిక దినోత్సవం(మే డే) ను కార్మిక వర్గ శ్రేణులు జిల్లాలో కార్మిక అడ్డాల వద్ద ఘనంగా అరుణ పతాకం ఎగురవేసి ఉత్సాహం జరపాలని ఏఐటియూసి జిల్లా అధ్యక్షులు సుతారి రాములు పిలుపు నిచ్చారు. శుక్రవారం రోజున కొరుట్ల డివిజన్ కేంద్రంలో కార్మికులతో మేడే ఉత్సవ గోడ పత్రికలు, కరపత్రాలు
ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ (ఏఐటీయూసీ) 1920లో పురుడు పోసుకోని కార్మిక చట్టాల కోసం నిరంతరం పోరాటం చేసిన ఏకైక కార్మిక సంఘం ఏఐటీ యూసీ అని కొనియాడారు .. ఫలితమే 8 గంటల పని దినమైనదని అన్నారు.. బ్రిటిష్ పరిపాలన నుండి దేశ స్వతంత్రం కోసం పోరాడిందన్నారు. త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించిన బిజెపి ప్రభుత్వ ను గద్దె దింపాలన్నారు.. 2024 పార్లమెంటు ఎన్నికలలో కార్మిక సంఘాలు ప్రజలను చైతన్య పరిచి ఇండియా కూటమిని గెలిపించాలని అన్నారు… అనేకసార్లు దేశవ్యాప్త సమ్మెలు చేసిన కార్మిక వర్గానికి మేలు జరిగింది లేదని ప్రధాన కార్మిక చట్టాలను పునరుద్దించాలని కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని కనీస వేతన చట్టాలు అమలు చేయాలని ఈఎస్ఐ, పిఎఫ్ బీమా పెన్షన్ సౌకర్యంతో పాటు పేదలకు అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. ఈ సమావేశంలో హమాలీ మున్సిపల్ బీడీ వర్కర్స్ ,వంశీ, చాంద్ పాషా, గంగారం, రవి , శ్రీనివాస్ , సాయిలు, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.