రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్ పీ.హెచ్.సీ ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్ సీ లోని రక్త పరీక్షల గది, మందులు అందజేసే గది, ఇన్ పేషెంట్ వార్డ్, బెడ్స్, టాయిలెట్స్, వాక్సినేషన్ ను పరిశీలించారు. ప్రతి రోజూ హాస్పిటల్ కు ఎంత మంది రోగులు వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.ఈ నెలలో ఎన్ని డెలివరీల లక్ష్యం ఉందని, ఇప్పటిదాకా ఎన్ని చేశారని డాక్టర్ కృష్ణవేణి ని అడుగగా, మొత్తం 34 లక్ష్యం కాగా, ఇప్పటిదాకా 24 పూర్తి చేశామని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. హాస్పిటల్ కు వచ్చే రోగులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని, వ్యక్తిగత , పరిసరాల పరిశుభ్రతపై వివరించాలని సూచించారు. ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Related Articles
స్కిల్ వర్శిటీకి అనుబంధంగా పాలిటెక్నిక్, ఐటీఐలు
తెలంగాణలోని ఐటీఐ, ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలలను…
Results | జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల.. తెలుగు విద్యార్థుల హవా
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email జేఈఈ మెయిన్స్ (JEE Mains) ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. నాలుగో విడత ఫలితాలను మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. ఇందులో దేశవ్యాప్తంగా 44మంది అభ్యర్థులు 100 పర్సంటైల్ సాధించగా, వారిలో 18 మంది విద్యార్థులకు మొదటి ర్యాంకు వచ్చింది. […]
హైదరాబాద్లో ఆరాజెన్ విస్తరణ
తెలంగాణలో ఔషదాల ఆవిష్కరణ, అభివృద్ధి సేవలను విస్…