తెలంగాణ

రాష్ట్ర బడ్జెట్ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన బండి సంజయ్..

కరీంనగర్: ఆదాయానికి వ్యయానికి పొంతన లేని రాష్ట్ర బడ్జెట్.6 గ్యారంటీలైన మహిళలకు 2 వేల 500, నిరుద్యోగులకు 4 వేల భ్రుతి, 4 వేల ఆసరా పెన్షన్, తులం బంగారం ఊసేది? 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డులకు పైసలు నో బడ్జెట్. కాంగ్రెస్ 420 హామీలకు బడ్జెట్ లో నిధులెందుకు ప్రతిపాదించలేదు. రుణమాఫీకి 35 వేల కోట్ల రూపాయల అవసరమని మీరే చెప్పారు. బడ్జెట్ లో 15 వేల కోట్లే కేటాయిస్తారా? రైతు భరోసాపై క్లారిటీ లేదు. ఇప్పటికే ఏడాది రైతు భరోసా సొమ్ము నష్టపోయిన రైతులకు న్యాయం చేయరా?
రాష్ట్రంలో 14 మంది నేతన్నలు ఆకలి మరణాలు జరిగినా పట్టించుకోరా? ఆటోడ్రైవర్లకు 12 వేల రూపాయల ఆర్దిక సాయం ఇస్తారా..ఇవ్వరా? 12 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 60 వేల ఉద్యోగాలిస్తున్నట్లు చెప్పడం పెద్ద జోక్. కోటి మంది మహిళలను కోటీశ్వరులనేది బోగస్. నిధులే కేటాయించకుండా కోటీశ్వరులను ఎట్లా చేస్తారు? లక్ష ఎకరాల్లో పామాయిల్ చెట్లు, ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీ నిధుల్లో కేంద్ర వాటా ఉందా? లేదా? విద్యకు 7 శాతం, ఆరోగ్య రంగానికి 4 శాతంలోపు కేటాయింపులు చేయడం సిగ్గు చేటు. 52 శాతం బీసీ జనాభా సంక్షేమానికి 3.5 శాతం 9 వేల 200 కోట్లు, నిధులే ప్రతిపాదిస్తారా?  దళిత సంక్షేమంలో భారీ కోత విధించి దళితులకు అన్యాయం చేశారు. గతేడాది కంటే ఈసారి ఎక్సైజ్ ద్వారా 6 వేల కోట్ల అదనపు ఆదాయంతో కేసీఆర్ కు ఇష్టమైన మద్యాన్ని ఏరులై పారించాలనుకుంటున్నారు. కేంద్ర నిధులకు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకపోవడంతో వేల కోట్ల నిధులు మురిగిపోయింది నిజం కాదా? కేంద్రం నిధులిస్తున్న పథకాలకు ప్రధానమంత్రి ఫొటో పెట్టి తీరాల్సిందే..లేనిపక్షంలో ఊరుకునే ప్రసక్తే లేదు.